తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగల బీభత్సం.. మద్యం షాపులో చోరీ - జగిత్యాల జిల్లాలో దొంగల బీభత్సం..

జగిత్యాల జిల్లాలోని ఓ వైన్స్​ షాప్​లో దొంగలు పడ్డారు. షట్టర్​ పగులగొట్టి మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Theft in a liquor shop at jagityala district
దొంగల బీభత్సం.. మద్యం షాపులో చోరీ

By

Published : Dec 4, 2019, 11:06 AM IST

జగిత్యాల మండలం ధరూర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వాటితో పాటు గ్రామ శివారులో ఉన్న వైన్స్​లో షట్టర్​ పగులగొట్టి చొరబడి.. మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. గత 10 రోజుల క్రితం జగిత్యాలలో వరుస దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు... కాస్త విరామం ఇచ్చి మళ్లీ తెగబడ్డారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో చోరీ జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు.

దొంగల బీభత్సం.. మద్యం షాపులో చోరీ

ABOUT THE AUTHOR

...view details