తెలంగాణ

telangana

ETV Bharat / state

SRSP CANAL: ఎస్సారెస్పీ చిన్నకాలువ గట్టుకు గండి.. పంటకు తీవ్ర నష్టం!

జగిత్యాల అర్బన్‌ మండలం మోతె శివారులో ఎస్సారెస్పీ చిన్న కాలువ గట్టు తెగిపోయింది. నీటి ఉద్ధృతికి సుమారు వంద ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. కాలువకు ఇటీవలే మరమ్మతు పనులు చేసినప్పటికీ.. సాగునీరు వదలడంతో మట్టి కొట్టుకుపోయి తెగిపోయింది.

తెగిపోయిన ఎస్సారెస్పీ చిన్న కాలువ గట్టు..
తెగిపోయిన ఎస్సారెస్పీ చిన్న కాలువ గట్టు..

By

Published : Aug 12, 2021, 1:30 PM IST

జగిత్యాల అర్బన్‌ మండలం మోతె శివారులో ఎస్సారెస్పీ చిన్న కాలువ గట్టు తెగిపోయింది. ఫలితంగా నీటి ఉద్ధృతికి సుమారు 100 ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. కాలువకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ మధ్యే మట్టి నింపారు. ఈలోగా కాలువకు సాగునీరు వదలడంతో మట్టి కొట్టుకుపోయి కాలువ తెగిపోయింది.

పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

గుత్తేదారు పనులు నాణ్యతగా చేయకపోవటం వల్లే కాలువ తెగిపోయిందని.. తాము పంటలు నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు మునిగిన పంట పొలాలను ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పరిశీలించారు. నష్టం అంచనా వేసి రైతులకు సాయం అందించాలని డిమాండ్​ చేశారు. ఇదిలా ఉండగా.. అధికారులు నీటి ప్రవాహం తగ్గించి కాలువకు మరమ్మతులు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ నుంచి పెట్రోల్, గ్యాస్- 12ఏళ్లకు ఫలించిన ప్రయత్నం

ABOUT THE AUTHOR

...view details