నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతం గుండా వస్తున్న వరదతోపాటు వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తిన వాగులతో గోదావరి నదీ ప్రవాహం పెరిగింది. జగిత్యాల ధర్మపురి సంతోషిమాత దేవాలయం వద్ద గల పుష్కర ఘాట్ల మెట్ల వరకు నీళ్లు వచ్చాయి. మంచిర్యాల, జగిత్యాల జిల్లా సరి హద్దున గల రాయపట్నం వంతెన వద్ద భారీగా నీళ్లు నిలిచాయి. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడం వల్ల నదిలో వరద ఉద్ధృతి మరింత పెరుగుతోంది. తీర ప్రాంత వాసులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.
గోదావరి నదిలో పెరుగుతున్న నీటిమట్టం - జగిత్యాల ధర్మపురి సంతోషిమాత దేవాలయం పుష్కర ఘాట్ల మెట్ల వరకు వచ్చిన నీళ్లు
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి సంతోషిమాత దేవాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్ మెట్ల వరకు నీళ్లు వచ్చాయి.
![గోదావరి నదిలో పెరుగుతున్న నీటిమట్టం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4872839-743-4872839-1572062093744.jpg)
గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం