తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల మార్కెట్​కు పోటెత్తిన ప్రజలు - జగిత్యాలలో సండే మార్కెట్​

ఆదివారం కావడం వల్ల జగిత్యాల జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్​ కిటకిటలాడింది. చేపలు, మాంసం కొనేందుకు జనం ఎగబడ్డారు. ఉదయం నుంచే చేపలు, మాంసం దుకాణాల వద్ద లైన్లలో నిలుచుని కొనుగోలు చేశారు.

Telangana news
జనగామ వార్తలు

By

Published : May 23, 2021, 5:21 PM IST

జగిత్యాల చేపల మార్కెట్​కు మాంసం ప్రియులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల పెద్దసంఖ్యలో చేపలు, మాసం దుకాణాల వద్ద క్యూకట్టారు. ఉదయం పదిగంటలకు లాక్​డౌన్​ నిబంధనలు అమల్లోకి వస్తున్నందున తెల్లవారుజామునుంచే మార్కెట్​ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

ఓ పక్క కొవిడ్​ భయం.. మరోపక్క లాక్​డౌన్​ నిబంధనలు… ఉన్న నాలుగ్గంటల్లోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉదయం నుంచే చేపలు, మాంసం దుకాణాల వద్ద లైన్లలో నిలుచుని కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:సైబరాబాద్​లో కఠినంగా లాక్​డౌన్ అమలు : సీపీ సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details