జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపులో.. తాగు నీటి ట్యాంకు ఎక్కి దివ్యాంగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగులు - దివ్యాంగుల సబ్‌ప్లాన్
ఎస్సీ సబ్ప్లాన్లా.. దివ్యాంగులకూ ఒక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని... దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపులో.. వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగులు
ఎస్సీ సబ్ప్లాన్లా దివ్యాంగులకూ ఒక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని.. దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయించి.. రుణాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ట్యాంక్ వద్దకు చేరుకున్న పోలీసులు.. వారిని కిందకు దింపి, అక్కడి నుంచి పంపేశారు.
ఇదీ చదవండి:ప్రముఖ హాస్యనటుడు గణేశన్ మృతి