New trend in Vegetables cultivation: ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాంటుతున్న వేళ సాగులో సరికొత్త పంథా ఎంచుకున్నారు. రోజూ వారి అవసరాలు తీర్చే కూరగాయలను పొలం గట్లపైనా సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేటలో కొందరు రైతులు విభిన్నంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతరపంటలు(farming on Intercrops in fields) సైతం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.పొలం చుట్టూ ఉన్న గట్టును సైతం ఉపయోగించుకుని కూరగాయలు పండిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా తీగజాతి మెుక్కల్ని పెంచుతున్నారు. గ్రామంలో ఎక్కువగా వరి, పసుపు, మొక్కజొన్న, సోయా, చెరుకు తదితర పంటలను సాగు చేస్తుంటారు. అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో అంతరపంటలుగా కూరగాయలు వేస్తూ... రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
ప్రధానంగా టమాట, బెండ, వంకాయ, దొండకాయ, కాకర, బీర వంటి కూరగాయలను(farming vegetables as Intercrops) పండిస్తున్నారు. తీగ జాతి కూరగాయల కోసం చిన్న పందిళ్లు వేసి సాగు చేస్తున్నారు. పెద్ద పందిళ్లు వేస్తే కాపు తక్కువగా వస్తున్నందునా.... ఈ విధంగా సాగు చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు డబ్బులు చేతికి అందుతున్నాయని... ఖర్చులకు ఇబ్బందులు తప్పాయని చెబుతున్నారు. ఒకే పంటపై ఆధార పడకుండా... మార్పులు చేసుకుంటూ ముందుకెళితే లాభాలు పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.... ఈ రైతుల ఆలోచన మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది. ప్రతి రైతు ఓకే పంటపై ఆధారపడకుండా మార్పులు చేసుకుంటూ సాగులో ముందుకెళితే మున్ముందు మంచి లాభాలు పొందవచ్చని ఈ ఆదర్శ రైతులు అభిప్రాయపడుతున్నారు.