తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Immersion: జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్లలో గణేశ్‌ మహారాజ్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

mmersion of Vinayaka statues
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

By

Published : Sep 19, 2021, 3:35 PM IST

జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్లలో ఉదయం నుంచే భక్తులందరూ తరలివచ్చి నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారు. భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. కరోనా ప్రభావంతో వినాయక శోభాయాత్ర సమయాన్ని తగ్గించుకున్న మండపాల నిర్వాహకులు ముందస్తుగానే ఉదయం నుంచే పట్టణ శివారులో ఉన్న వాగులో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఈసారి అన్ని పట్టణాల్లో ఒకేసారి వినాయక నిమజ్జనం జరుగుతుండడంతో పలు కళాశాలల విద్యార్థుల సహకారంతో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వాగు వద్ద విగ్రహం నిమజ్జనం చేయడానికి పిల్లలను లోపలికి అనుమతించకుండా చర్యలు చేపట్టారు. కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కువ శాతం మంది విగ్రహాలను త్వరగా తీసుకెళ్లి గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

ఇదీ చూడండి:Balapur laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details