జగిత్యాల టీఆర్‌నగర్ చెక్‌పోస్టు వద్ద ఆకలిలో అల్లాడుతున్న కోతులను పోలీసులు చూసి చలించిపోయారు. జగిత్యాల రూరల్ సీఐ రాజేశ్, మరికొంత మంది పోలీసులు వాటికి పండ్లను తెప్పించి ఆహారంగా అందించారు. సమీపంలో కొండగట్టు ఆలయం ఉండగా అక్కడ వేలాది కోతులు ఉన్నాయి. వాటికి భక్తులు ఆహారం అందిస్తారు.
కోతులకు ఆహారం అందించిన పోలీసులు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలు ఆకలితో అల్లాడుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆహారం, నీళ్లు దొరకక ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి మూగజీవాలకు పండ్లను అందించి మానవత్వం చాటుకున్నారు పోలీసులు.
కోతులకు సాయం చేసిన పోలీసులు
గత నెల రోజులుగా ఆలయం మూసి ఉండటం వల్ల కోతులు ఆహారం దొరకక గ్రామాలబాట పడుతున్నాయి. గ్రామాల్లోనూ వాటికి ఆహారం దొరకటంలేదు. క్షణం తీరిక లేకుండా వీధులు నిర్వహిస్తున్న పోలీసులు వాటికి ఆహారం అందించి తమ వంతు మానవత్వం చాటుకున్నారు.
ఇదీ చూడండి :విద్యార్థులూ... మానసిక సమస్యలుంటే ఫోన్ చేయండి