తెలంగాణ

telangana

ETV Bharat / state

గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య - గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శంషొద్దీన్(28)పై సన్నిహితుడు గొడ్డలితో దాడి చేశాడు.

గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

By

Published : Nov 7, 2019, 9:01 AM IST

ధర్మపురి ఎస్​ఐ శ్రీకాంత్​ తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురికి చెందిన శంషొద్దీన్​, నేపాల్​కు చెందిన దీపక్​ అవస్త్​ కొంత కాలంగా తుక్కుకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు. ఓ విషయంలో ఇద్దరికి మనస్పర్థలు రావడం వల్ల దీవక్​ అవస్త్​ గొడ్డలితో శంషొద్దీన్​పై దాడి చేశాడు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ధర్మపురి ఎస్​ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

ఇదీ చూడండి : నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details