జగిత్యాల జిల్లా కేంద్రంలో 33వ రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ... జగిత్యాల జిల్లాలో కేవలం తొమ్మిది మంది మాత్రమే విధుల్లో చేరారు. సమ్మెలో భాగంగా డిపో వద్దకు చేరుకున్న కార్మికులు ఆందోళన చేశారు. డిపో నుంచి బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. కార్మికులకు మద్దతుగా తెదేపా, తెజస, పలువురు ఆందోళనలో పాల్గొన్నారు.
బస్సుల్ని అడ్డుకునేందుకు యత్నించిన కార్మికుల అరెస్ట్ - tsrtc workers strike at jagitial
జగిత్యాల బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్న పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బస్సులను అడ్డుకునేందుకు యత్నంచిన కార్మికుల అరెస్ట్