తెలంగాణ

telangana

ETV Bharat / state

'హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ' - Jagityala SP office

హత్య కేసును పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు తాండ్రయాల గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సుమారు వెయ్యి మందికి పైగా తరలి వచ్చిన గ్రామస్థులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

'హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ'

By

Published : Aug 26, 2019, 6:47 PM IST

జగిత్యాల జిల్లా తాండ్రయాల గ్రామానికి చెందిన ముక్కెర మహేశ్ అనే డిగ్రీ విద్యార్థి ఈ ఏడాది మే 18న ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి మృతి చెందాడు. అయితే కథలాపూర్ పోలీసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ ప్రేమలేఖ బంధువులకు దొరికింది. ప్రమాదం కాదు... హత్య చేశారని పోలీసులకు బంధువులు వెల్లడించారు. వారు పట్టించుకొక పోవటం వల్ల ఆగ్రహించిన గ్రామస్థులు ఆందోళ చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ సింధు శర్మకు వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

'హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ'

ABOUT THE AUTHOR

...view details