జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అంబేడ్కర్ స్టేడియంలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు ఫిజికల్ డైరెక్టర్ సందీప్ బాస్కెట్బాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఉదయం 5:30 నుండి 7:30 వరకు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు బాస్కెట్ బాల్ శిక్షణ అందిస్తున్నారు. ఖాళీ సమయంలో నిత్యం పిల్లలకు ఆటలు నేర్పుతూ వారిలో శారీరక మానసిక స్థైర్యాన్ని నింపుతున్నాడు.
ఏకాగ్రత కూడా
ఈ రోజుల్లో చరవాణులు, టీవీలకు అతుక్కుపోయి... పబ్జీ గేముల బారినపడి పిల్లలు చెడు దారి పడుతుంటే.... సందీప్ నేర్పుతున్న ఉచిత శిక్షణతో కాలనీ పిల్లలంతా మంచి నడవడికను నేర్చుకుంటున్నారు. బాస్కెట్ బాల్ శిక్షణతో పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఎందరో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించి వారికి అండగా వుంటూ..సందీప్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ వేసవిలో కూడా పిల్లలు చెడు మార్గం పట్టకుండా ఉండేందుకు శిక్షణ ఇస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నాడు.... అతడి స్ఫూర్తితో చిన్నారులంతా పలు క్రీడల్లోను చాంపియన్లుగా నిలిచి గురువుకు తగ్గ శిష్యులుగా పేరు సంపాదిస్తున్నారు.
ఈ గురువు.. ఎందరికో ఆదర్శం.. ఇవీ చూడండి:బాలికలేకాదు... బాలురిపైనా లైంగిక దాడులు