జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటు నమోదైంది. 13వ పోలింగ్ బూతులో వెల్లుల లక్ష్మి అనే మహిళ ఓటును గుర్తు తెలియని వారు వేసి వెళ్లారు. అసలు ఓటరు ఓటు వేసేందుకు రాగా.. అసలు విషయం బయటపడింది. ఫలితంగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.
మెట్పల్లి సహకార ఎన్నికల్లో టెండర్ ఓటు నమోదు - latest news on Tender vote in the Met Palli Cooperative Election
మెట్పల్లి సహకార సంఘం ఎన్నికల్లో టెండర్ ఓటు నమోదైంది. ఫలితంగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
![మెట్పల్లి సహకార ఎన్నికల్లో టెండర్ ఓటు నమోదు Tender vote in the Met Palli Cooperative Election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6080738-1029-6080738-1581750594148.jpg)
మెట్పల్లి సహకార ఎన్నికల్లో టెండర్ ఓటు నమోదు
చివరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసలు ఓటరు వెల్లుల లక్ష్మితో టెండర్ ఓటు వేయించేందుకు అధికారులు సిద్ధం కాగా.. కొందరు అభ్యర్థులు దీనికి అభ్యంతరం తెలిపారు. ఫలితంగా పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మెట్పల్లి సహకార ఎన్నికల్లో టెండర్ ఓటు నమోదు