ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని శ్రీ చెన్న కేశవస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలిరావడం వల్ల ఆలయాలు కిటకిటలాడాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు - latest news on mukkoti ekadashi
నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మెట్‌పల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు Temples with windows of devotees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5608213-1038-5608213-1578277121080.jpg)
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
ఇవీ చూడండి: శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!