Farmers protests for paddy Procurement :ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలంటూ.. జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. మల్లాపూర్ మండలం పాత దాంరాజ్‌పల్లి వద్ద అన్నదాతలు ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
Koulu rythu : ధాన్యం కొనుగోళ్లపై అయోమయం.. కౌలు రైతుల్లో కలవరం
కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకుని.. అధిక కోతలు లేకుండా వీలైంనత త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, స్థానిక తహసీల్దార్... రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చదవండి:Telugu Akademi FD Case : 'పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు ఇస్తానంటే రూ.5 కోట్లు ఇచ్చేశా'