తెలంగాణ

telangana

ETV Bharat / state

'వయో వృద్ధుల జీవితానుభవాలే.. నేటి తరానికి పాఠాలు'

వయో వృద్ధులను సంపదగా భావించాలని, వారి ఆలోచనలు, సూచనలు నేటితరానికి ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో ఆన్​లైన్​లో జరిగిన వయో వృద్ధుల దినోత్సవంలో పాల్గొన్నారు.

By

Published : Oct 1, 2020, 7:03 PM IST

telangana welfare minister koppula eeshwar
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను గతంలో కొందరు కుమారులు, కూతుళ్లు ఇంట్లోంచి తరిమి కొట్టేవారని, సీఎం కేసీఆర్ ఇస్తున్న వృద్ధాప్య పింఛన్​ వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల బాగోగులు చూస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో ఆన్​లైన్​లో జరిగిన వయో వృద్ధుల దినోత్సవంలో పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకులు, వైద్యులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. మంత్రి కొప్పుల.. వృద్ధుల కోసం ప్రత్యేక యాప్​, వెబ్​సైట్​ను ప్రారంభించారు.

అంతకుముందు టీఆర్​నగర్​లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. వయో వృద్ధులను మన సంపదగా భావించాలని, వారి ఆలోచనలు, సూచనలు నేటి తరానికి ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. వారి అనుభవాలే నేటి తరానికి పాఠాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details