రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి పిల్లలు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం మంచు ఎక్కువ కురుస్తున్నందున రాహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారంరోజుల నుంచి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉపశమనం పొందేందుకు ప్రజలు చలి మంటలు కాసుకుంటున్నారు. చలిని దృష్టిలో పెట్టుకుని చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి చంపేస్తోంది... అందరినీ వణికిస్తోంది! - telangana state has more cold
చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. పొద్దున్నే బయటకు రావాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి తీవ్రత