రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పర్యటించిన ఆయన.. 2.50 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీకి జనాభా ప్రకారం పట్టణ ప్రగతి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రతినెల ఠంఛనుగా రూ.148 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
KTR : 'రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు' - minister ktr visited jagtial district
కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తిందని తెలిపారు.
మంత్రి కేటీఆర్, మున్సిపల్ చట్టంపై కేటీఆర్, జగిత్యాలలో కేటీఆర్
జగిత్యాల జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరైనట్లు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 4 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 2014 తర్వాత మరో 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు తెలిపారు.
- ఇదీ చదవండి :పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ