తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లూరి సీతారామరాజు తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం అల్లూరి సీతారామరాజు తండాలో యువతులు, మహిళలు గోధుమ నార బుట్టలను నెత్తిన ఎత్తుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఏటా ఆనవాయతీగా వస్తున్న ఈ పండుగను గిరిజనులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

alluri sitarama raju tanda people celebrates teez festival
అల్లూరి సీతారామరాజు తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

By

Published : Aug 7, 2020, 12:35 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం అల్లూరి సీతారామరాజు తండాలో గిరిజనులు తీజ్​ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తండాలోని మహిళలు, యువతులు నూతన వస్త్రాలను ధరించి.. గోధుమ నార బుట్టలను నెత్తిన ఎత్తుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. యువతులు, మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

అనంతరం గోధుమ నార బుట్టలను తండా శివారు ప్రాంతంలో నిమజ్జనం చేశారు. తర్వాత తండాలోని గిరిజన కుటుంబాలు గ్రామ శివారులో వనభోజనాలు చేశారు. తీజ్ వేడుకలు జరుపుకోవడం వల్ల పాడిపంటలతో కుటుంబాలన్నీ ఆనందంగా ఉంటాయని గిరిజనుల నమ్మకం. అందువల్లే ప్రతి సంవత్సరం ఆనవాయతీగా వస్తున్న ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

ఇదీ చూడండి :రైలింజన్ ఢీకొని.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details