ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) ఆధ్వర్యంలో జగిత్యాలలోని తహసీల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. పీఆర్‌సీ నివేదిక ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి అందజేసిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ప్రభుత్వంపై మండిపడ్డారు.
పీఆర్సీపై ఉపాధ్యాయుల నిరసన.. ధర్నా - telangana varthalu
జగిత్యాలలోని తహసీల్ చౌరస్తాలో పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పీఆర్‌సీ నివేదిక ప్రతులను కాల్చివేసి నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల నిరసన... పీఆర్‌సీ నివేదిక ప్రతుల దహనం
ఈ సందర్భంగా ప్రతులను కాల్చివేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌ను కోరారు.
ఉపాధ్యాయుల నిరసన... పీఆర్‌సీ నివేదిక ప్రతుల దహనం
ఇదీ చదవండి: పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం