ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ ఆర్టీసీ కార్మికులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అయిదో రోజు సమ్మె చేస్తున్న కార్మికులను కలిసి వారికి మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామిని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పండగ పూట సీఎం సంతోషంగా ఉన్నారని... కార్మికులను మాత్రం పండగ కూడా చేసుకోనీయకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రమణ డిమాండు చేశారు. యూనియన్ల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలి గాని... సీఎం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఎల్. రమణ స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఎల్.రమణ మద్దతు - ఆర్టీసీ కార్మికులకు తెదేపా అండ
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మద్దతు పలికారు.

ఆర్టీసీ కార్మికులకు ఎల్.రమణ మద్దతు
ఆర్టీసీ కార్మికులకు ఎల్.రమణ మద్దతు