తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2021, 12:20 PM IST

ETV Bharat / state

మెట్​పల్లిలో భద్రాచల సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయంలో భద్రాచల సీతారాము తలంబ్రాల కార్యక్రమం ఘనంగా జరిగింది. సీతారాముల తలంబ్రాల కోసం పండించిన వడ్లను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి తీసుకొచ్చి... మేళ తాళాలతో ఊరేగించి... రామభజన నడుమ తలంబ్రాలుగా మలిచారు.

Talambaras are prepared for the Bhadrachalam Sita Rama wedding in MetPalli
Talambaras are prepared for the Bhadrachalam Sita Rama wedding in MetPalli

శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించే భద్రాచల సీతారాముల కల్యాణంలో వినియోగించే బియ్యాన్ని తలంబ్రాలుగా మలిచే కార్యక్రమం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారాముల తలంబ్రాల కోసం పండించిన వడ్లను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చారు. సీతారాముల చిత్రపటంతో పాటు తలంబ్రాల వడ్లను మంగళ హారతులు, మేళతాళాల మధ్య భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.

అనంతరం ఆలయానికి తీసుకొచ్చి... జానకీరాఘవుల చిత్రపటం ముందు రామ భజన చేస్తూ భక్తులు బియ్యంగా ఒలిచారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. రామనామంతో పరిసరాలు మారుమోగిపోయాయి. సీతారాముల కల్యాణానికి వెళ్లకుండా... స్వయానా ఇక్కడే భద్రాచలం వెళ్లి కల్యాణంలో పాల్గొన్న అనుభూతి కలిగిందని భక్తులు పరవశించిపోయారు.

ఇదీ చూడండి: కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం

ABOUT THE AUTHOR

...view details