సామాన్యులకు వైద్య పరీక్షలు చేరువ కావాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం 'టీ డయాగ్నస్టిక్ హబ్' లకు శ్రీకారం చుట్టిందన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాలలో ఏర్పాటైన కేంద్రాన్ని జడ్పీ ఛైర్పర్సన్ వసంత, అదనపు కలెక్టర్ అరుణశ్రీలతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వైరాలజీ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
'టీ డయాగ్నస్టిక్ హబ్’ను ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాలలో 'టీ డయాగ్నస్టిక్ హబ్’ అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. జడ్పీ ఛైర్పర్సన్ వసంతతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు.
T Diagnostic Hub
రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన హాబ్లో రక్త పరీక్షలను ఉచితంగా జరపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం 57 రకాల పరీక్షలు అందుబాటులో ఉండనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్, ఆర్డీవో దుర్గా మాధురి, తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీచదవండి:ఆక్సిజన్, రెమ్డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి