జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. నాలుగు రోజుల వేడుకలో భాగంగా మూడో రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి శాంతి పాటలు, కుంభ పూజలు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు అర్చకులు వివిధ రకాల ద్రవాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హోమం పూర్ణహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
మెట్పల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం - swamivaari-vedukalu in jagiytala
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మెట్పల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం