తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల ఏఎస్పీగా సురేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ - అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అనారోగ్యంతో మృతి

ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన జగిత్యాల ఏఎస్పీ దక్షిణామూర్తి స్థానంలో అదనపు ఎస్పీగా సురేశ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు.

Breaking News

By

Published : Sep 19, 2020, 1:37 PM IST

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా జె.సురేశ్‌ కుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అనారోగ్యంతో ఈ మధ్యనే మృతిచెందగా ఆయన స్థానంలో సురేశ్‌కుమార్‌ విధుల్లో చేరారు. గ్రూప్‌-1 క్యాడర్‌కు సురేశ్ గతంలో ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పని చేశారు.

హైదరాబాద్ నుంచి..

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి జగిత్యాలకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు జిల్లా ఇంఛార్జీ ఎస్పీ, కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవిని కలిశారు. జిల్లాలో నేరాల పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం కృషి చేస్తానని ప్రజలకు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్​ కసరత్తు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details