జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల సమీపంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లను అధికారులు తొలగించారు. వాటిలో ఉన్న ఇద్దరు యువకులు... తమకు నివాసం లేదని, మా ఇంటిని తొలగించవద్దంటూ అడ్డుకున్నారు.
ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుల నిరసన - పెట్రోల్‌తో యువకులు ఆందోళన
రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ఈ క్రమంలో షెడ్లను తొలగిస్తుండగా తమ ఇంటిని తొలగించవద్దంటూ ఇద్దరు యువకులు అడ్డుకుని... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు.
అధికారులను అడ్డుకుని... పెట్రోల్ పోసుకుని...
ఒంటిపై పెట్రోలు పోసుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, యువకులకు మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి:'కరోనాను వ్యాపారంగా చూడొద్దు.. అనవసరంగా పరీక్షలు చేయొద్దు'