Sugarcane Farmers Protest in Jagtial : కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం ముత్యంపేటలో మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో చెరుకు రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రేపు కోరుట్లలో జరగబోయే సభలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమ పునః ప్రారంభించి ఇక్కడే ఉత్పత్తి చేయండి.. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల విన్నపం
Farmers Demand to Reopen Muthyampet Sugar Factory : చెరుకు ఫ్యాక్చరీ పునః ప్రారంభంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోందని చక్కెర రైతులు విమర్శించారు. చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించ లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పసుపు బోర్డు విషయమై ఎంపీ ఎన్నికల్లో రైతులందరూ సంఘటితంగా పోటీ చేసి కవితను ఓడిచ్చినట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం భారీ ఎత్తున చెరుకు రైతులు పోటీలో నిలబడి బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని రైతులు హెచ్చరించారు.
కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. నిజామాబాద్ పసుపు బోర్డు కోసం రైతుల మాదిరిగా.. రాబోయే శాసన సభ ఎన్నికల్లో రైతులందరం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తాం. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి చక్కెర కార్మాగారం తిరిగి ప్రారంభించేందుకు సానుకూలంగా ప్రకటన చేయాలి. - చెరుకు రైతు, జగిత్యాల