జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదో తరగతి విద్యార్థుల మాస్కులతో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ఇన్విజిలేటర్లు కూడా ముఖాలకు మాస్కులు కట్టుకునే విధులు నిర్వరించారు. ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు మాస్కులు కట్టించి మరీ తమ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు పంపించారు.
మాస్కులతో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు - మెట్పల్లిలో మాస్కులు ధరించి పరీక్షలకు వచ్చిన విద్యార్థులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మాస్కులతో వచ్చారు.
![మాస్కులతో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు Students and invigilators wearing masks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6463619-thumbnail-3x2-teacher-rk.jpg)
మాస్కులతో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు
మాస్కులతో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు
పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు పరీక్షల భయం లేకున్నా కరోనా భయం పట్టుకుందని పలువురు అభిప్రాయ పడ్డారు.
Last Updated : Mar 19, 2020, 12:40 PM IST