జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. నెలలు గడుస్తున్నా... సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోవటం వల్ల వేతనాలు రాక ఇల్లు గడవటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భోజన ప్లేట్లు పట్టుకొని భిక్షాటన చేస్తూ... డిపో గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
'వేతనాలు లేక... ఇల్లు గడవటం లేదు...' - TSRTC STRIKE UPDATE
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 47వ రోజు కొనసాగుతోంది. వేతనాలు రాకా ఇల్లు గడవటం లేదంటూ... జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపో ముందు కార్మికులు భిక్షాటన చేసి నిరసన చేశారు.
!['వేతనాలు లేక... ఇల్లు గడవటం లేదు...'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5121652-thumbnail-3x2-pp.jpg)
STRC STRIKE IN DIFFERENT WAY IN METPALLY