అందుబాటులోకి లేజర్ స్పీడ్‌గన్ సేవలు - speed gun services started
వాహనదారుల వేగాన్ని తగ్గించేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ సింధూ శర్మ చేతుల మీదుగా లేజర్ స్పీడ్‌గన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అందుబాటులోకి లేజర్ స్పీడ్‌గన్ సేవలు
జగిత్యాల జిల్లాలో ప్రమాదాలు నివారించేందుకు లేజర్ స్పీడ్ గన్ సేవలను జిల్లా ఎస్పీ సింధూ శర్మ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా వాహనాలు వేగంగా వెళ్తే ఫోటోలను తీసి... చోదకులకు చలాన్ పంపుతారు. అతివేగంగా వెళ్లే వాహనాలకు ఈ లేజర్‌గన్‌తో కళ్లెం వేయొచ్చని సింధూశర్మ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె అన్నారు.
TAGGED:
speed gun services started