తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలకు చేరుకున్న శ్రామిక్​ రైలు - corona virus

శుక్రవారం ముంబయి నుంచి 842 మందితో బయలుదేరిన శ్రామిక్​ రైలు లోకమాన్య తిలక్​ టెర్మినల్​ ఎక్స్​ప్రెస్​ జగిత్యాలకు చేేరుకుంది. ముంబయి నుంచి వచ్చిన వారికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్​ ముద్ర వేసి స్వస్థలాలకు పంపించారు.

special train reached to jagitial today
జగిత్యాలకు చేరుకున్న శ్రామిక్​ రైలు

By

Published : May 30, 2020, 9:22 PM IST

ముంబయి నుంచి బయలు దేరిన శ్రామిక్​ రైలు జగిత్యాలకు చేరుకుంది. శుక్రవారం రాత్రి 842 ప్రయాణికులతో బయలుదేరిన శ్రామిక్​ రైలు లోకమాన్య తిలక్ టెర్మినల్​ ఎక్స్​ప్రెస్​ జగిత్యాలకు శనివారం సాయంత్రం చేరుకుంది. మెుత్తం 842 మందిలో 337 మంది ప్రయాణికులు మాత్రమే జగిత్యాల రైల్వే స్టేషన్​లో దిగినట్లు సమాచారం. మిగతా వారు రైలు సిగ్నల్​ కోసం ఆగినపుడు దిగి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. జగిత్యాల స్టేషన్​లో దిగిన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్​ ముద్రవేసి ప్రత్యేక బస్సుల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. జూన్ 17 వరకు క్వారంటైన్​లో ఉండాలని వారికి సూచించారు. జగిత్యాల అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి ఉప్పల శ్రీధర్ పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది, పోలీసులు రైల్వే స్టేషన్​లో ఉండి కార్మికులను వారివారి ఇళ్లకు పంపే ఏర్పాటు చేశారు. ముంబయిలో చిక్కుకుపోయిన వారంతా ఇళ్లకు చేరడం వల్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: కరోనా వ్యాప్తిని తెలుసుకునేందుకు రంగంలోకి ఐసీఎంఆర్

ABOUT THE AUTHOR

...view details