జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం అందరినీ ఆకట్టుకుంటుంది. గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఈ ప్రకృతి వనం కనువిందు చేసేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు ఆరు లక్షల నిధులతో చేపట్టిన గ్రామ ప్రజలకు వరంగా మారింది. గ్రామానికి తాగునీటిని అందించే మూడు వాటర్ ట్యాంకులు ఈ ప్రకృతి వనానికి ప్రత్యేకతను చాటుతున్నాయి.
ప్రజల పాలిట వరంగా మారిన.. పచ్చందాల పల్లె ప్రకృతి వనాలు - Vempeta village prakruthi vanam is the latest news
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో చేపట్టిన ప్రకృతి వనాలు ప్రజల పాలిట వరంగా మారాయి. రోజంతా ఏదో ఓ పని చేసి అలసి పోయిన ప్రజలు మంచి వాతావరణం అందరికీ ఆరోప్రాణాన్ని అందిస్తున్నాయి.
పచ్చని గడ్డిలో కుర్చీలను వేసి సేదతీరేందుకు అవకాశం ఉండడంతో ప్రజలను ఆకట్టుకుంటోంది. సుమారు 20 రకాల మొక్కలతో పచ్చదనాన్ని పెంచుతున్నారు. వనం చిన్నదైన ప్రజలను ఆకట్టుకుంటోంది.
ప్రతి వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రకృతి వనం మధ్యలో బుద్ధ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. పిల్లలతో సహా కుటుంబ సభ్యులు పార్కులకు వెళ్లాలంటే గ్రామాల్లో పార్కులు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రకృతి వనాలు గ్రామాలకు పచ్చని పార్కులుగా మారాయి. ఈ భవనాన్ని చూసి జిల్లా కలెక్టర్ రవి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాలక వర్గాన్ని అభినందించారు. గ్రామాలలో ఇలాంటి ప్రకృతి వనాలు ఉండడం ప్రజలకు మంచి వాతావరణాన్ని అందించమని తెలిపారు.
- ఇదీ చూడండి:రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!