జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంతానయుక్త సాంబశివ నాగేశ్వరాలయంలో కుంకుమ పూజలు, గీత హవన యజ్ఞాన్ని నిర్వహించారు. గీతాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మౌన హరిస్వామి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు - శివరాత్రి పూజలు
సంతానయుక్త సాంబశివ నాగేశ్వరాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు భక్తులు గీతా పారాయణం చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి.
ఇవీ చూడండి:ఏప్రిల్ 1 నుంచి శుద్ధి చేసిన ఇంధనం