లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ - counting
లెక్కింపు కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.
లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తున్నామని వెల్లడించారు.