తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణ ప్రగతితో సమస్యలకు పరిష్కారం' - పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా ఆదుకునేలా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏళ్ల తరబడి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వార్డులకు ప్రస్తుతం పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు.

Solving Problems in Cities with Urban Progress at jagtial
'పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమస్యలకు పరిష్కారం'

By

Published : Feb 28, 2020, 10:47 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో పలు రకాల మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలిపారు.

ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాలు పరిశుభ్రంగా మారనున్నాయని అన్నారు. మొన్నటి వరకు పల్లె ప్రగతి నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పడు పట్టణాలపై దృష్టి సారించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

'పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమస్యలకు పరిష్కారం'

ఇదీ చూడండి : సాదాసీదా పావురం కాదది.. చెన్నై పందేల పావురం..!

ABOUT THE AUTHOR

...view details