తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫేస్​బుక్​ మిత్రుల దాతృత్వం... నిరుపేద పూజారికి చేయూత - నిరుపేద పూజారికి చేయూత

సోషల్​ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడమే కాదు మంచి పనులు కూడా చేయొచ్చని ఈ ఘటన రుజువు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వరప్రసాద్​ అనారోగ్యంతో పాటు ఆర్థికంగా బాధపడుతుంటే ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు. ఈ పోస్ట్​కు ఎన్నారైలు స్పందించారు. లక్షా 17 వేల రూపాయలను సాయంగా అందించారు.

social media effect and facebook post helped to priest
ఫేస్​బుక్​ మిత్రుల దాతృత్వం... నిరుపేద పూజారికి చేయూత

By

Published : Sep 2, 2020, 1:57 PM IST

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భార్య పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ వైద్యం, తిండి ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద పూజారి కుటుంబానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫేస్​బుక్ మిత్రులు లక్షా 17వేల రూపాయలు సాయం అందించారు.

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యలమర్తి వరప్రసాద్ గత కొన్ని సంవత్సరాల నుంచి కుష్టు వ్యాధితో పాటు ఫూట్​ అల్సర్​తో బాధపడుతున్నాడు. గతంలో ఓ చిన్న సంస్థలో చిరువేతనంతో సెక్యూరిటీ గార్డ్​గా పని చేస్తూ, సెలవు రోజుల్లో పౌరోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల నుంచి పని చేయలేని స్థితిలో ఇంటి వద్దే ఉంటున్నాడు.

వరప్రసాద్​కు వికలాంగుల పింఛను కింద లభిస్తున్న రూ.3వేల తో ఇంటి అద్దె, వైద్య ఖర్చులకు సరిపోగా.. తిండి ఖర్చులు, పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్నారు. వీరి స్థితిని మిత్రుల ద్వారా తెలుసుకున్న ద్గర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి ఆగస్టు 3న ఫేస్​బుక్​లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు.

స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు, ఇతరులు కలిసి వరప్రసాద్ బ్యాంక్ ఖాతాకు రూ.1.17 లక్షలు సాయం అందించారు. వాటిలో భవిష్యత్ ఖర్చుల కోసం 70 వేలను ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయగా... మిగిలినవి వైద్య, తిండి ఖర్చులకు వరప్రసాద్ సేవింగ్ ఖాతాలో నిల్వ ఉంచారు.

ఇవీ చూడండి: నేతన్నల నేస్తం ఈ ఖమ్మం కుర్రాడు..

ABOUT THE AUTHOR

...view details