జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలవారితో పాటు.. వివిధ జిల్లాల వారు కలిసి కరోనా బాధితుల కోసం తన వంతు సాయం చేసి... అండగా నిలిచారు. కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా బాధితులకు భారత్‌లో ఆక్సిజన్ కొరత ఉండటంతో ఇండియాకు అబూదాబికి చెందిన సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ దిల్లీ వారికి పంపించారు.
ఇండియా సోషల్ సెంటర్ వారు భారత దౌత్యకార్యాలయ అధికారులను సంప్రదించిన వెంటనే వారు భారత్‌కి అందిస్తున్న సహాయంలో భాగంగా ఐఎస్సీ వారు అందిస్తున్న సహాయాన్ని చేర్చుకోవాల్సిందిగా కోరారు. భారత దౌత్య కార్యాలయం కోరిన మేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఐఎస్సీ భారత్‌కు విరాళంగా ఇస్తున్న ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా భారత్‌కు రవాణా చేస్తున్నారు. నింపిన ఆక్సిజన్ సిలిండెర్లని ఒక ప్రత్యేక ప్యాకింగ్ విధానంలో పంపాల్సి ఉంటుంది.