లాక్‌డౌన్‌తో ఆకలికి అలమటిస్తున్న నిరుపేదలు, యాచకులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని స్నేహాలయ యూత్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు తయారు చేసి వీధి వీధి తిరిగి పంచిపెడుతున్నారు.
నిరుపేదలు, యాచకులకు అండగా స్నేహాలయ యూత్ - మెట్పల్లిలో నిరుపేదలకు, యూచకులకు ఆహారం పంపిణీ
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్నేహాలయ యూత్ సభ్యులు నిరుపేదలకు, యాచకులకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలు, యాచకులకు అండగా స్నేహాలయ యూత్
వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక కరపత్రం తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అవసరం మేరకే బయటకు రావాలని సూచించారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ...హైదరాబాద్‌లో 'దిల్లీ' కుదుపు.. జమాత్‌కు వెళ్లొచ్చిన వారే కారణం