Six Women suffers infection in Jagtial: ఓ వైపు మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద పీటవేస్తుంటే.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పలుచోట్ల మహిళల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సిజేరియన్ తర్వాత ఆరుగురు బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకి కుట్లు ఊడిపోతున్నాయి.
ఆరుగురు బాలింతలకు ఇన్ఫెక్షన్.. అదే కారణమా? - ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రం జగిత్యాల
Six Women suffers infection in Jagtial: గతేడాది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటన మరవకముందే.. జగిత్యాల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో ఆరుగురు బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాలింతలు ఆరోపిస్తున్నారు.
Six Women suffers infection in Jagtial
కుట్లు ఊడిపోయి బాధపడుతున్న ఆరుగురు బాలింతల్లో ఇద్దరికి కుట్లు వేయగా.. మరో నలుగురికి కుట్లు వేయాల్సి ఉంది. ఇన్ఫెక్షన్ వల్లే కుట్లు ఊడిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారని బాలింతలు తెలిపారు. ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర చీము పూర్తిగా పట్టేసిందని ఆందోళన చెందారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. వైద్యులు, సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని బాలింతలు వాపోయారు.
ఇవీ చదవండి: