జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ప్రజలు శ్రీ అయ్యప్ప ఆలయంలో శాంతి యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరోనా మహమ్మారి త్వరలో మాయమై ప్రజలు సుఖశాంతులతో ఉండేలా కాపాడాలని స్వామివారిని వేడుకున్నారు. అంతకు ముందు అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ మొదలగు వాటితో అభిషేకాలు నిర్వహించారు.
Shanthi yagnam: కరోనా నాశనమవ్వాలంటూ అయ్యప్ప ఆలయంలో శాంతియజ్ఞం - మెట్పల్లి శ్రీ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి పోవాలని కోరుతూ.. జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ అయ్యప్ప ఆలయంలో శాంతి యజ్ఞాన్ని నిర్వహించారు.

కరోనా నాశనమవ్వాలంటూ.. అయ్యప్ప ఆలయంలో శాంతియజ్ఞం
ఈ కార్యక్రమంలో అలయ కమిటీ చైర్మన్ గంగుల దేవరాజం, ఉపాధ్యక్షులు కోట బుచ్చి గంగధర్, కాటిపెల్లి ఆదిరెడ్డి, అంకతి భరత్ కుమార్, చింతల నారాయణ భక్తులు పాల్గొన్నారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు