కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నాయి. తమ తమ ఊరి పొలిమేరల్లో ముళ్ల కంపలు వేస్తూ.. గ్రామాల్లోకి కొత్తవారెవరూ రాకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు.
జగిత్యాలలో పలు గ్రామాల స్వీయ నిర్బంధం - latest news on Self-Detention of Many Villages in jagtial district
కరోనా కట్టడి దిశగా పలు గ్రామాలు అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వ సూచనల మేరకు స్వీయ నిర్బంధం పాటిస్తున్నాయి. తమ ఊళ్లోకి ఎవరూ రావొద్దంటూ గ్రామస్థులు సరిహద్దుల్లో కంచెలు వేసి అడ్డుకుంటున్నారు. సమాజ హితం కోసం స్వచ్ఛందంగా లాక్డౌన్ను పాటిస్తున్నారు.
జగిత్యాలలో పలు గ్రామాల స్వీయ నిర్బంధం
జగిత్యాల జిల్లాలో మొత్తం 380 గ్రామ పంచాయతీలు ఉండగా.. దాదాపు సగం గ్రామ పంచాయతీలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నాయి. గ్రామస్థులు ఇళ్లలోనే ఉండాలంటూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గత 3 రోజులుగా జిల్లాలోని గ్రామస్థులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఇదీ చూడండి:ఆగని కరోనా ఉద్ధృతి...17వేలు దాటిన మరణాలు