జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35 ఏ రద్దుపై కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య విలువలు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
'370 రద్దు అంతర్ యుద్ధానికి దారి తీస్తుంది' - ప్రత్యేక ప్రతిపత్తి
కశ్మీర్‌కు స్వయం ప్రతిప్రత్తి కల్పించే ప్రకరణలను కేంద్రం ఏకపక్షంగా రద్దు చేసిందని జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.
!['370 రద్దు అంతర్ యుద్ధానికి దారి తీస్తుంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4048067-thumbnail-3x2-jeevan.jpg)
ప్రకరణ 370, 35ఏ లను ఏకపక్షంగా రద్దు చేశారు : జీవన్ రెడ్డి
ప్రకరణ 370, 35ఏ లను ఏకపక్షంగా రద్దు చేశారు : జీవన్ రెడ్డి
ఇవీ చూడండి : హయత్‌నగర్ కిడ్నాపర్‌కు 18 ఏళ్ల నేర చరిత్ర