తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు.. మొదలైన పాఠాలు

తెలంగాణ వ్యాప్తంగా బడులు పునఃప్రారంభమయ్యాయి. జగిత్యాల జిల్లాలోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. జిల్లాలో 200 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14వేల 185 మంది.. 9,10 తరగతి విద్యార్థులు ఉన్నారు.

schools
పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు.. మొదలైన పాఠాలు

By

Published : Feb 1, 2021, 3:13 PM IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 9, 10 తరగతి పాఠశాలల తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 200 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14వేల 185 మంది.. 9,10 తరగతి విద్యార్థులు ఉన్నారు. వీటితో పాటు కస్తూర్బా, మోడల్​ స్కూల్లు, ప్రైవేటు పాఠశాలకు చేరుకున్నారు. కరోనాతో మూత పడిన పాఠశాలలు 11 నెలలు తర్వాత తెరుచుకోవడంతో ఇన్నాళ్లు ఆన్​లైన్​ తరగతులకే పరిమితమైన విద్యార్థులు ఎట్టకేలకు ప్రత్యక్షంగా పాఠాలు వినేందుకు ఉత్సాహంగా పాఠశాలకు చేరుకున్నారు.

ఇవాళ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి జగన్​మోహన్​రెడ్డి తెలిపారు. తొలిరోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు స్క్రినింగ్​ నిర్వహించి పాఠశాలకు అనుమతించారు. విద్యార్థులు మాస్కులు ధరించి తరగతి గదుల్లోకి చేరారు. విద్యాశాఖ పూర్తి స్థాయిలో కొవిడ్​ నిబంధనలు పాటించి తరగతులను నిర్వహిస్తున్నామని విద్యాధికారి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details