Kondamuchu in School: కోతుల బెడదతో రైతులు, ప్రజలేకాదు విద్యార్థులూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాలజిల్లా మల్యాల మండలం తాటిపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలలో కోతుల బాధ కారణంగా విద్యార్థులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. పలుమార్లు విద్యార్థినులపై మర్కటాలు దాడి చేసి గాయపరిచాయి. పాఠశాల ఆవరణలో వందలాది కోతులు సంచరిస్తూ సీసీ కెమెరాలను విరగ్గొట్టేవి. విద్యుత్తు వైర్లను సైతం తెంపేసేవి.
అక్కడి విద్యార్థుల చదువులకు కొండముచ్చు కాపలా!
Kondamuchu in School : ఆ ఊరితో పాటు పాఠశాలకు కోతుల బెడద ఎక్కువైంది. ఎంతగా అంటే విద్యార్థులు బయట తిరగాలంటే భయపడేంతగా. ఒకవేళ ఎవరైనా కనిపిస్తే మర్కటాల దాడి తప్పదు అన్నట్లు ఉండేది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఓ కొండముచ్చును తెప్పించారు. ఎందుకంటే..?
కాపలా కాస్తున్న కొండముచ్చు
కోతుల బెడదను నివారించడానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఏడాది క్రితం రూ.60 వేలు వెచ్చించి కడప జిల్లా నుంచి రెండు కొండముచ్చులను తెప్పించారు. వాటిలో ఓ మగ కొండముచ్చు మృతి చెందగా ఆడ కొండముచ్చును మాత్రం పాఠశాల ఆవరణలో కట్టేస్తున్నారు. దీనివల్ల కోతులు విద్యాలయంలోకి ప్రవేశించడానికి జంకుతున్నాయి. కొండముచ్చుకు కూరగాయలు, పండ్లు అందజేస్తూ ప్రతినెలా సంరక్షకుడికి రూ.6వేలు చెల్లిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
Last Updated : Dec 16, 2021, 8:21 AM IST