తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితుడి చికిత్స కోసం తోటి విద్యార్థుల విరాళాల సేకరణ - స్నేహితుడి చికిత్స కోసం విరాళాల సేకరణ

అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి ప్రమాదం రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులు రూ. లక్షల్లో అవుతాయని చెప్పడంతో కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి మేమున్నామంటూ తోటి స్నేహితులు ముందుకొచ్చారు. సంపాదించే వయసు కాకపోయినా విరాళాలు సేకరిస్తూ గాయపడిన స్నేహితుల కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

school friends are collecting donations for friends health
స్నేహితుడి చికిత్స కోసం తోటి విద్యార్థుల విరాళాల సేకరణ

By

Published : Nov 12, 2020, 10:42 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడిని చికిత్స ఖర్చుల కోసం ఆదుకోవడానికి తోటి స్నేహితులు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంపాదించే వయసు కాకపోయినా విరాళాలు సేకరిస్తూ తమవంతు సాయం అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్​కు చెందిన నలుగురు మృతి చెందారు. అదే కుటుంబానికి చెందిన కొందరికి గాయాలయ్యాయి.

మల్లాపూర్​ మండలానికి చెందిన చిన్నారులు సృజన్​ మల్లాపూర్​లోని ఆదర్శ పాఠశాలలో, శృతి సరస్వతి పాఠశాలలో చదువుతున్నారు. ప్రమాదంలో సృజన్​ కోమాలోకి వెళ్లగా, శృతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి చికిత్స నిమిత్తం రూ. 12 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయం తెలుసుకున్న శృతి, సృజన్​ స్నేహితులు తమ వంతు సహాయం అందించేందుకు విరాళాలు సేకరిస్తున్నారు.

చిన్న వయసులోనే వీరు స్నేహానికి ఇస్తున్న విలువను తెలుసుకొని సహాయం చేయడానికి పలువురు ముందుకొస్తున్నారు.

ఇదీ చదవండి:ఐశ్వర్య ఆత్మహత్యకు ముందు కేటీఆర్​కు ట్వీట్.. సోనూసూద్​కు మెయిల్​​..!

ABOUT THE AUTHOR

...view details