తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ప్రోటోకాల్‌ పాటించటంలేదు' - SARANGAPUR MPTC PROTESTED FOR NOT FOLLOWING PROTOCOL

ప్రోటోకాల్​ పాటించకుండా తనపై వివక్ష చూపిస్తున్నారని జగిత్యాల జిల్లా సారంగపూర్​ ఎంపీటీసీ ప్రసన్న నిరసన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశంలో కింద కూర్చొని ఆందోళన చేసింది.

SARANGAPUR MPTC PROTESTED FOR NOT FOLLOWING PROTOCOL
SARANGAPUR MPTC PROTESTED FOR NOT FOLLOWING PROTOCOL

By

Published : Dec 23, 2019, 7:59 PM IST

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ప్రొటోకాల్‌ పాటించటంలేదంటూ... సారంగపూర్‌ ఎంపీటీసీ సభ్యురాలు పసన్న ఆందోళన చేశారు. మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కింద కుర్చోని నిరసన తెలిపింది. జగిత్యాల జిల్లా సారంగపూర్‌లో జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో తాను అక్కడే ఉన్నప్పటికీ వేదిక మీదికి ఆహ్వనించకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలిని అయినందు వల్లే... తనపై వివక్షచూపుతున్నారని సర్వసభ్య సమావేశంలో ఆమె వాపోయారు. అధికారులు నచ్చజెప్పటం వల్ల ప్రసన్న ఆందోళన విరమించారు.

'ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ప్రోటోకాల్‌ పాటించటంలేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details