జగిత్యాల జిల్లా సంగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన సాగుతోంది.. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో తరగతులు సాగుతుండగా 302 మంది విద్యార్థులున్నారు. గత ఉపాధ్యాయులు పెంచిన చెట్లతో పాఠశాల నందన వనంగా కనిపిస్తోంది.
అమ్మ ఒడిని తలపించే ఆ బడి గురించి మీకు తెలుసా? - సంగంపల్లి ప్రభుత్వ పాఠశాల
సర్కారు బడంటేనే సమస్యతో సహవాసం. అక్కడి విద్య అంతంతమాత్రం! కానీ ఈ పాఠశాల అందుకు విరుద్ధం. కార్పొరేట్ స్కూలును తలదన్నేంత ఆహ్లాదం. తరగతుల నిర్వహణ ఆదర్శం. అమ్మ ఒడిని తలపించే ఆ బడి గురించి... ఆనందంతో స్వాగతం పలికే ఆ గుడి గురించి తెలుసుకుందామా...
ఒక సంగంపల్లి పాఠశాల విద్యార్థులే కాకుండా తక్కల్లపల్లి, కల్లెడ, అనంతారం, పొలాస, గుట్రాజ్‌పల్లి, సోమన్‌పల్లి, హబ్సీపూర్ తదితర 10 గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.. సాధారణంగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండగా ఈ పాఠశాలలో మాత్రం 302 మంది విద్యార్థులు చదువుతున్నారు.
కార్పొరెట్‌కు దీటుగా విద్యను బోధిస్తుండటం, పాఠశాల ఆవరణ పచ్చదనంతో మనోహరంగా ఉండటం వల్ల విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు. మంచి విద్యను అందిస్తే సర్కార్ బడైనా విద్యార్థులు చేరతారనడానికి సంగంపల్లి ప్రభుత్వ పాఠశాలే నిదర్శనం.
- ఇదీ చూడండి : ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్- 'నిర్భయ' దోషుల కోసమేనా?