తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లి చేపల మార్కెట్లో రద్దీ - Jagitial News

మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి చేపల మార్కెట్​లో చేపల కొనుగోలుదారులు తెల్లవారుజాము నుంచే సందడి చేశారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే..ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటారన్న నమ్ముతారు. ఓ వైపు కరోనా విస్తారంగా వ్యాపిస్తున్నా.. చేపల కోసం మార్కెట్​కి పోటెత్తారు.

Rush In Metpally Fish Market Due To Mrugashira
మెట్​పల్లి చేపల మార్కెట్లో రద్దీ

By

Published : Jun 7, 2020, 12:41 PM IST

మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లన్నీ మాంసాహార ప్రియులతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి చేపల మార్కెట్ తెల్లవారుజాము నుంచే ప్రజలతో రద్దీగా కనిపించింది. మృగశిర కార్తె రోజు చేపలను ఆహారంగా తీసుకుంటే సంవత్సరంపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున చేపల మార్కెట్ ప్రజలతో నిండిపోతుంది. కోనుగోలుదారుల కోసం మార్కెట్​లో మత్స్యకారులు వివిధ రకాల చేపలను విక్రయానికి ఉంచారు. వాటిని కొనేందుకు ప్రజలు సైతం ఆసక్తిగా ఎగబడ్డారు. చేపల కోసం మాంసాహారులు పెద్దఎత్తున తరలిరావడం వల్ల అమ్మకందారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారని కొనేవారు వాపోయారు.

కరోనా ప్రభావంతో చేపల మార్కెట్​లో పలు నిబంధనలు విధించినా.. ప్రజలు వాటిని పట్టించుకోలేదు. చాలామంది భౌతిక దూరం పాటించకుండా.. మాస్క్​ ధరించకుండా చేపల కోసం ఎగబడ్డారు. అమ్మకందారులు కూడా మాస్కులు లేకుండానే అమ్మకాలు సాగించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి.. తగు జాగ్రత్తలతో వచ్చినవారు మార్కెట్​ పరిస్థితి చూసి.. ఆందోళనకు గురయ్యారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details