ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపిస్తున్నారు. విధులు నిర్వహించేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. టెస్ట్ డ్రైవ్ నిర్వహించి డ్రైవర్లను నియమించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపోలో 43మంది డ్రైవర్లు, కండక్టర్లను తీసుకున్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలు, సీనియారిటీ పత్రాలు చూపించి విధుల్లో చేర్చుకుంటున్నారు. టికెట్ ధరలు అధికంగా వసూళు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు - rtc-employes-strike
జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపోలో తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. విద్యార్హత, సీనియారిటీ పత్రాలు చూసి విధుల్లోకి తీసుకుంటున్నారు.

ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు
ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు