'ఆర్టీసీకి లాభాలు వచ్చేలా విధులు నిర్వహిద్దాం' - మెట్పల్లి ఆర్టీసీ డిపోలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
పదవీ విరమణను పొడగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు.
!['ఆర్టీసీకి లాభాలు వచ్చేలా విధులు నిర్వహిద్దాం' rtc employees happy about kcr latest decision on employees retirement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5499009-609-5499009-1577352954776.jpg)
ఆర్టీసీకి లాభాలు వచ్చేలా విధులు నిర్వహిద్దాం
జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పొడగిస్తూ... ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఎంతో లాభపడ్డారని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇదే ఉత్సాహంతో పని చేస్తూ... మంచి లాభాలు తీసుకువచ్చేలా పని చేద్దామంటూ నిర్ణయించుకున్నారు.
ఆర్టీసీకి లాభాలు వచ్చేలా విధులు నిర్వహిద్దాం